National

గత 24 గంటల్లో కోలుకున్న 3,02,544 మంది..!

దేశంలో గడచిన 24 గంట‌ల సమయంలో కొత్త‌గా 2,22,315 మందికి కరోనా నిర్ధారణ అయిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అదే సమయంలో 3,02,544 మంది కోలుకున్నారు. భారతదేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,67,52,447కు చేరింది. 4,454 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మొత్తం 3,03,720కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,37,28,011 మంది కోలుకున్నారు. 27,20,716 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 19,60,51,962 మందికి వ్యాక్సిన్లు వేశారు. దేశంలో నిన్నటి వరకు మొత్తం 33,05,36,064 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది.

23-05-2021న ఆంధ్రప్రదేశ్ అధికారులు వెల్లడించిన కరోనా వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 91,629 కరోనా పరీక్షలు నిర్వహించగా 18,767 మందికి పాజిటివ్ అని తేలింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 2,887 కొత్త కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 2,323 కేసులు గుర్తించారు. అదే సమయంలో 20,109 మంది కరోనా నుంచి కోలుకోగా, 104 మంది మరణించారు. చిత్తూరు జిల్లాలో 15 మంది, పశ్చిమ గోదావరి జిల్లాలో 13 మంది, విజయనగరం జిల్లాలో 11 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 15,80,827 పాజిటివ్ కేసులు నమోదు కాగా 13,61,464 మంది కోలుకున్నారు. ఇంకా 2,09,237 మంది చికిత్స పొందుతున్నారు. మొత్తం మరణాల సంఖ్య 10,126కి పెరిగింది.

తెలంగాణ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 42,526 కరోనా పరీక్షలు నిర్వహించగా 2,242 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 343 కొత్త కేసులు నమోదయ్యాయి. నిర్మల్ జిల్లాలో అత్యల్పంగా 7 కేసులు గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా 4,693 మంది కొవిడ్ నుంచి కోలుకుని ఆరోగ్యవంతులు కాగా, 19 మంది మరణించారు. తెలంగాణలో ఇప్పటివరకు 5,53,277 పాజిటివ్ కేసులు నమోదు కాగా 5,09,663 మంది కోలుకున్నారు. ఇంకా 40,489 మందికి చికిత్స కొనసాగుతోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

nineteen − 3 =

Back to top button