భారతదేశంలో కొత్తగా 12,729 కరోనా కేసులు నమోదు అయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అదే సమయంలో 221 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో కరోనా నుంచి 12,165 మంది కోలుకున్నారు. ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 1,48,922 మంది చికిత్స తీసుకుంటున్నారు. కరోనా నుంచి ఇప్పటివరకు మొత్తం 3,37,24,959 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య మొత్తం 4,59,873గా ఉంది. ఇప్పటివరకు దేశంలో మొత్తం 1,07,70,46,116 వ్యాక్సిన్ డోసులు వినియోగించారు.
తెలంగాణ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 22,650 కరోనా పరీక్షలు నిర్వహించగా, 106 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 49 కేసులు నమోదయ్యాయి. జగిత్యాల, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, కొమరంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, ములుగు, నాగర్ కర్నూల్, నారాయణపేట, వికారాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 179 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒక మరణం సంభవించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,72,052 పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,64,212 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,879 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,961కి పెరిగింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 36,373 కరోనా పరీక్షలు నిర్వహించగా, 301 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 63 కొత్త కేసులు నమోదు కాగా, అత్యల్పంగా విజయనగరం, అనంతపురం జిల్లాలలో 3 కేసుల చొప్పున గుర్తించారు. అదే సమయంలో 367 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,67,556 పాజిటివ్ కేసులు నమోదు కాగా 20,49,338 మంది ఆరోగ్యవంతులయ్యారు. ప్రస్తుతం 3,830 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 14,388కి పెరిగింది.