National

గత 24 గంటల్లో భారత్ లో కోలుకున్న 3,57,295 మంది

భార‌తదేశంలో గడచిన 24 గంట‌ల సమయంలో కొత్త‌గా 2,59,591 మందికి కరోనా నిర్ధారణ అయిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం తెలిపింది. అదే సమయంలో 3,57,295 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,60,31,991కు చేరింది. మరో 4,209 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 2,91,331 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,27,12,735 మంది కోలుకున్నారు. 30,27,925 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 19,18,79,503 మందికి వ్యాక్సిన్లు వేశారు

తెలంగాణ ప్రభుత్వం బ్లాక్ ఫంగస్ ను అంటువ్యాధుల జాబితాలో చేరుస్తూ అధికారికంగా ప్రకటించింది. చైనా వైరస్ నుంచి కోలుకున్న వారిని మ్యుకర్‌మైకోసిస్‌ (బ్లాక్‌ ఫంగస్‌) ఇన్‌ఫెక్షన్‌ సోకుతోంది. దీంతో కేంద్రం దీన్ని అంటువ్యాధుల చట్టం (ఎపిడెమిక్‌ డిసీజెస్‌ యాక్ట్‌ 1897) కింద పరిగణించాలని రాష్ట్రాలను ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ అదనపు కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ రాష్ట్రాలకు లేఖను పంపారు. ఫలితంగా ఇకపై బ్లాక్‌ ఫంగస్‌ నిర్ధారణ అయిన వారి వివరాలను రాష్ట్రాలు కేంద్ర హోంశాఖకు నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఈ వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు పలు సూచనలు కూడా చేసింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు, కళాశాలలు బ్లాక్‌ ఫంగస్‌ నిర్ధారణ, చికిత్సకు కేంద్రం సూచించిన మార్గదర్శకాలు అనుసరించాలని కేంద్రం రాష్ట్రాలకు స్పష్టం చేసింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

five × one =

Back to top button