More

    దేశంలో కరోనా కేసుల అప్డేట్స్

    భారతదేశంలో గత 24గంటల్లో 54,069 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. అదే సమయంలో 68,885 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,00,82,778 కు చేరింది. గత 24 గంటల్లో 1,321 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,91,981 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,90,63,740 మంది కోలుకున్నారు. 6,27,057 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.

    23-06-2021న ఆంధ్రప్రదేశ్ అధికారులు వెల్లడించిన కరోనా వివరాల ప్రకారం.. ఏపీలో గత 24 గంటల్లో 4,684 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. తూర్పుగోదావరి జిల్లాలో 1,171 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో అత్యల్పంగా 73 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇదే సమయంలో 36 మంది కరోనాతో మృతి చెందారు. 24 గంటల్లో 7,324 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 18,62,036కి పెరిగింది. ఇప్పటి వరకు 17,98,380 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 51,204 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 12,452 మంది ప్రాణాలు కోల్పోయారు.

    తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 1,18,109 పరీక్షలు నిర్వహించగా 1,114 కరోనా కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 129 కేసులు వెలుగుచూడగా, అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లాలో రెండు కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 6,16,688కి పెరిగింది. 3,598 మంది మరణించారు. అదే సమయంలో 1280 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 5,96,628 మంది కరోనా నుండి కోలుకున్నారు.

    Related Stories