దేశంలో కరోనా కేసుల అప్డేట్స్

0
875

భారతదేశంలో క‌రోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గత 24 గంటల్లో 16,764 కరోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో క‌రోనా నుంచి నిన్న‌ 7,585 మంది కోలుకున్నారు. క‌రోనా కార‌ణంగా గత 24 గంటల్లో 220 మ‌ర‌ణాలు సంభ‌వించాయి. ప్ర‌స్తుతం 91,361 మంది ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో చికిత్స తీసుకుంటున్నారు. దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 1,270 ఒమిక్రాన్ కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. తెలంగాణ‌లో 67, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 16 ఒమిక్రాన్ కేసులు న‌మోద‌య్యాయి.

తెలంగాణలో గత 24 గంటల్లో 280 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 206 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా కారణంగా ఒక వ్యక్తి మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,563 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 6,81,587కి పెరిగింది. వీరిలో 6,73,999 మంది కోలుకోగా.. 4,025 మంది మృతి చెందారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 130 కరోనా కేసులు నమోదయ్యాయి. విశాఖ జిల్లాలో అత్యధికంగా 30 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో నెల్లూరు జిల్లాలో ఒకరు మరణించారు. గత 24 గంటల్లో 97 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 20,76,979కి చేరింది. 20,61,405 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం 14,493 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,081 యాక్టివ్ కేసులు ఉన్నాయి.