National

భారతదేశంలో భారీగా తగ్గుతున్న కరోనా కేసులు.. తెలంగాణలో లాక్ డౌన్ పొడిగింపు

భార‌తదేశంలో ఇటీవలి కాలంలో కొత్త‌ క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్న సంగతి తెలిసిందే..! తాజాగా కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన కరోనా వివరాల ప్రకారం గత 24 గంటల్లో 1,52,734 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. అదే సమయంలో 2,38,022 మంది కోలుకున్నారు. భారతదేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,80,47,534కు చేరింది. మరో 3,128 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,29,100కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,56,92,342 మంది కోలుకున్నారు. 20,26,092 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 21,31,54,129 మందికి వ్యాక్సిన్లు వేశారు.

తెలంగాణ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 61,053 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,801 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. జీహెచ్ఎంసీ పరిధిలో 390 కొత్త కేసులు వెల్లడి కాగా, అత్యల్పంగా నిర్మల్ జిల్లాలో 3 కేసులు గుర్తించారు. కామారెడ్డి జిల్లాలో 4, ఆదిలాబాద్ జిల్లాలో 5, యాదాద్రి భువనగిరి జిల్లాలో 6, కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో 9 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 3,660 మంది కరోనా నుంచి కోలుకోగా, 16 మరణాలు సంభవించాయి. రాష్ట్రంలో ఇప్పటిదాకా 5,75,827 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 5,37,522 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 35,042 మందికి చికిత్స జరుగుతోంది. మొత్తం మరణాల సంఖ్య 3,263కి చేరింది.

ఆదివారం నాడు సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైన తెలంగాణ క్యాబినెట్ రాష్ట్రంలో మరో 10 రోజుల పాటు లాక్ డౌన్ పొడిగించాలని నిర్ణయించింది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సడలింపు ఇచ్చారు. ఇంటి నుంచి బయటికి వచ్చిన వారు మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల లోపు ఇళ్లకు చేరుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎవరైనా బయట కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే కార్యకలాపాలకు అనుమతించిన ప్రభుత్వం కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో, మరికొన్ని గంటలు అదనపు సమయం ఇవ్వాలని నిర్ణయించింది. మధ్యాహ్నం 1 గంట నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు లాక్ డౌన్ అమల్లో ఉంటుంది. పరిమితంగా వాణిజ్య కార్యకలాపాలకు క్యాబినెట్ ఆమోదం లభించింది.

30-05-2021న ఆంధ్రప్రదేశ్ అధికారులు వెల్లడించిన కరోనా వివరాల ప్రకారం.. గడచిన 24 గంటల్లో 84,232 కరోనా పరీక్షలు నిర్వహించగా 13,400 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. తూర్పుగోదావరి జిల్లాలో 2,598 కేసులు నమోదు కాగా, అతి తక్కువగా విజయనగరం జిల్లాలో 362 కేసులు గుర్తించారు. అదే సమయంలో 21,133 మంది కరోనా నుంచి కోలుకోగా, 94 మంది మరణించారు. చిత్తూరు జిల్లాలో 14, ప్రకాశం జిల్లాలో 9, పశ్చిమ గోదావరి జిల్లాలో 9 మంది మృత్యువాతపడ్డారు. దాంతో, రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 10,832కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 16,85,142 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 15,08,515 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 1,65,795 మందికి చికిత్స కొనసాగుతోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

15 + four =

Back to top button