దేశంలో కరోనా కేసుల అప్డేట్స్..!

0
860

భారత దేశంలో కొత్తగా 1225 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తాజా గణాంకాల ప్రకారం దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,30,24,440కి చేరింది. ఇందులో 4,24,89,004 మంది బాధితులు కోలుకున్నారు. మరో 14,307 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు 5,21,129 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో కొత్తగా 28 మంది మృతిచెందగా, 1594 మంది వైరస్‌ నుంచి బయటపడ్డారు. దేశవ్యాప్తంగా 184.06 కోట్ల టీకాలు పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 19,052 కరోనా పరీక్షలు నిర్వహించగా, 40 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 21 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 35 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటిదాకా 7,91,253 పాజిటివ్ కేసులు నమోదు కాగా 7,86,680 మంది కోలుకున్నారు. ఇంకా 462 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా కరోనాతో 4,111 మంది మరణించారు.

ఏపీలో గత 24 గంటల్లో 8,349 కరోనా పరీక్షలు నిర్వహించగా, 15 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. శ్రీ‌కాకుళం జిల్లాలో 4 కొత్త కేసులు, తూర్పు గోదావరి జిల్లాలో 3 కేసులు నమోదయ్యాయి. గుంటూరు, కడప, కర్నూలు, ప్రకాశం, విజయనగరం, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. అదే సమయంలో 41 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా మరణాలేవీ సంభవించలేదు. ఏపీలో ఇప్పటివరకు 23,19,524 పాజిటివ్ కేసులు నమోదు కాగా 23,04,506 మంది కోలుకున్నారు. ఇంకా 288 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 14,730 మంది కరోనాతో మరణించారు.