తగ్గుతున్న మహమ్మారి ప్రభావం.. దేశంలో కరోనా కేసుల అప్డేట్స్..!

0
720

భారతదేశంలో క‌రోనా కేసుల సంఖ్య త‌గ్గుతూ వస్తోంది. ఆదివారం నాడు 2.34 ల‌క్ష‌ల పాజిటివ్ కేసులు న‌మోద‌వ‌గా.. గత 24 గంటల్లో 2.09 ల‌క్ష‌ల కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దేశ‌వ్యాప్తంగా కొత్త‌గా 2,09,918 క‌రోనా కేసులు నమోద‌య్యాయి. దీంతో భారతదేశంలో మొత్తం కేసులు 4,13,02,440కు చేరాయి. 3,89,76,122 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. 4,95,050 మంది మృతిచెందారు. గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 959 మంది మ‌ర‌ణించ‌గా, 2,62,628 మంది కోలుకున్నారు. యాక్టివ్ కేసులు 4.43 శాతం ఉన్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 15.77 శాతంగా ఉంది.

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 65,263 కరోనా పరీక్షలు చేయగా 2,484 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 1,045 కొత్త కేసులు నమోదు అయ్యాయి. అదే సమయంలో 4,207 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,61,050 పాజిటివ్ కేసులు నమోదు కాగా 7,18,241 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 38,723 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,086కి పెరిగింది.

ఆంధ్రప్రదేశ్ లో గడచిన 24 గంటల్లో 39,296 కరోనా పరీక్షలు చేయగా 10,310 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా కడప జిల్లాలో 1,697 కొత్త కేసులు నమోదు అయ్యాయి. అదే సమయంలో 9,692 మంది కరోనా నుంచి కోలుకోగా, 12 మంది మరణించారు. తాజా మరణాలతో కలిపి ఏపీలో ఇప్పటివరకు 14,606 మంది కరోనాతో మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 22,70,491 పాజిటివ్ కేసులు నమోదు కాగా 21,39,854 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,16,031 మంది చికిత్స పొందుతున్నారు.