More

    దేశంలో కరోనా కేసుల అప్డేట్స్

    భారతదేశంలో కొత్త క‌రోనా కేసుల సంఖ్య భారీగా త‌గ్గింది. గత 24 గంటల్లో 6,990 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో 190 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో 10,116 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 1,00,543 మంది చికిత్స తీసుకుంటున్నారు. మొత్తం 3,40,18,299 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. మృతుల సంఖ్య మొత్తం 4,68,980గా ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 123,25,02,767 క‌రోనా డోసుల‌ను వినియోగించారు.

    తెలంగాణ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 33,236 కరోనా పరీక్షలు నిర్వహించగా, 184 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 70 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 137 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,75,798 పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,68,227 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,581 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,990కి పెరిగింది.

    ఏపీలో గడచిన 24 గంటల్లో 18,730 కరోనా నమూనాలు పరీక్షించగా, 101 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 19 కేసులు నమోదు కాగా, విజయనగరం, కర్నూలు జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. అదే సమయంలో 138 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,72,725 పాజిటివ్ కేసులు నమోదు కాగా 20,56,184 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 2,102 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 14,439కి పెరిగింది.

    Trending Stories

    Related Stories