More

    భారతదేశంలో కరోనా కేసుల అప్డేట్స్..!

    భారత దేశంలో కొత్తగా 1604 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,46,53,266కు చేరాయి. ఇందులో 4,41,04,933 మంది కోలుకోగా, 5,29,016 మంది బాధితులు మృతిచెందారు. మరో 18,317 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో 2160 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక మొత్తం కేసుల్లో 0.04 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.77 శాతం, మరణాలు 1.18 శాతంగా ఉన్నాయని తెలిపింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 219.63 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడించింది.

    Trending Stories

    Related Stories