దేశంలో కరోనా కేసుల అప్డేట్స్

0
657

భారతదేశంలో కొత్త‌గా 14,313 మందికి క‌రోనా నిర్ధార‌ణ అయ్యాయి. అదే సమయంలో క‌రోనా వ‌ల్ల 549 మంది మరణించారు. గత 24 గంటల్లో 13,543 మంది కరోనా నుండి కోలుకున్నారు. తాజా గణాంకాల ప్రకారం భారతదేశంలో కరోనా నుండి కోలుకున్న వారి సంఖ్య మొత్తం 3,36,41,175కు చేరింది. దేశంలో ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 1,61,555 మంది క‌రోనాకు చికిత్స తీసుకుంటున్నారు. క‌రోనా కేసుల సంఖ్య మొత్తం 3,42,60,470కు చేరింది. మృతుల సంఖ్య మొత్తం 4,57,740కు పెరిగింది. దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 60,70,62,619 క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు.

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 38,442 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 174 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 65 కొత్త కేసులు నమోదు కాగా, వికారాబాద్, నిజామాబాద్, ములుగు, కొమరంభీం ఆసిఫాబాద్, జోగులాంబ గద్వాల, జయశంకర్ భూపాలపల్లి, జనగామ జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 202 మంది ఆరోగ్యవంతులు కాగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 6,71,174 పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,63,124 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,096 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,954కి పెరిగింది.

29-10-2021న ఆంధ్రప్రదేశ్ అధికారులు వెల్లడించిన కరోనా వివరాల ప్రకారం.. గడచిన 24 గంటల్లో 39,604 కరోనా పరీక్షలు నిర్వహించగా, 481 మందికి పాజిటివ్ గా వెల్లడైంది. ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోనే 157 కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా అనంతపురం జిల్లాలో 6 పాజిటివ్ కేసులు గుర్తించారు. అదే సమయంలో 385 మంది కరోనా నుంచి కోలుకోగా ఒక మరణం సంభవించింది. రాష్ట్రంలో ఇప్పటిదాకా 20,65,716 పాజిటివ్ కేసులు నమోదు కాగా 20,46,512 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,837 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 14,367కి పెరిగింది.