దేశంలో కరోనా కేసుల అప్డేట్స్..!

భారతదేశంలో గత 24 గంటల్లో కొత్తగా 23,529 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. తాజా గణాంకాల ప్రకారం దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,37,39,980కు చేరింది. దేశంలో తాజాగా 28,718 మంది కోలుకోగా, ఇప్పటివరకు మొత్తం 3,30,14,898 మంది కోలుకున్నారు. గత 24 గంటల్లో కరోనాతో 311 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కరోనా మృతుల సంఖ్య మొత్తం 4,48,062కి చేరింది. 2,77,020 మంది ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స పొందుతున్నారు. కేరళలో కొత్తగా 12,161 మందికి కరోనా సోకింది. 155 మంది గత 24 గంటల్లో ఆ రాష్ట్రంలో కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.
29-09-2021న ఆంధ్రప్రదేశ్ అధికారులు వెల్లడించిన కరోనా వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో 57,345 శాంపిల్స్ పరీక్షించగా, కొత్తగా 1,084 కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 244 కేసులు నిర్ధారణ అయ్యాయి. కర్నూలు జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఇదే సమయంలో 13 మంది మహమ్మారి కారణంగా మృతి చెందగా 1,328 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 20,49,314కి పెరిగింది. ఇప్పటి వరకు మొత్తం 20,23,496 మంది కోలుకున్నారు. కరోనా బారిన పడి 14,163 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 11,655 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
స్పుత్నిక్ కు షాకిచ్చిన భారత హాస్పిటల్స్:
భారత్ లో వ్యాక్సినేషన్ దూసుకుపోతోంది. భారత్ లో తయారవుతున్న టీకాలకు పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తూ ఉంది. దీంతో ఇతర దేశాల టీకాలకు ఇచ్చిన ఆర్డర్స్ ను భారత్ లోని ఆసుపత్రులు రద్దు చేసుకుంటూ ఉన్నాయి. దేశంలోని కొన్ని ప్రైవేటు హాస్పిటళ్లు.. రష్యాకు చెందిన స్పుత్నిక్ వీ టీకాల ఆర్డర్లను రద్దు చేశాయి. స్పుత్నిక్ టీకాలను నిల్వ చేయాలంటే అతిశీతల వాతావరణం అవసరం ఉంటుంది. దీంతో మూడు అతిపెద్ద హాస్పిటళ్లు స్పుత్నిక్ వీ టీకాల ఆర్డర్లను రద్దు చేశాయి. పుణెలోని భారతీ విద్యాపీఠ మెడికల్ కాలేజీ, హైదరాబాద్లో 8 వ్యాక్సినేషన్ సెంటర్ల నడుపుతున్న అవిస్ హాస్పిటళ్లు, పుణెకు చెందిన మరో కంపెనీ కూడా సుత్నిక్ వీ ఆర్డర్లను రద్దు చేసుకున్నాయి. ఇండియాలో స్పుత్నిక్ వీ టీకాలను డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ఉత్పత్తి చేస్తున్నది. ఇప్పటి వరకు 9.43 లక్షల స్పుత్నిక్ వీ టీకాలను ప్రైవేటు హాస్పిటళ్లు పంపిణీ చేశాయి. స్పుత్నిక్ టీకాలను నిల్వ చేయాలంటే మైనస్ 18 డిగ్రీల సెల్షియస్ ఉష్ణోగత్రలు ఉండాలి. ఇక ప్రైవేటు మార్కెట్లో ఆస్ట్రాజెనికా టీకా ధర కన్నా స్పుత్నిక్ టీకా ధర 47 శాతం ఎక్కువగా ఉంది.