More

    దేశంలో కరోనా కేసుల అప్డేట్స్..!

    దేశంలో గత 24 గంటల్లో 42,909 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. తాజా గణాంకాల ప్రకారం దేశంలో క‌రోనా కేసుల సంఖ్య మొత్తం 3,27,37,939కి చేరింది. అదే సమయంలో 34,763 మంది కోలుకున్నార‌ని తెలిపింది. అదే సమయంలో దేశంలో క‌రోనాతో మ‌రో 380 మంది మృతి చెందారు. మొత్తం మృతుల సంఖ్య 4,38,210కి పెరిగింది. క‌రోనా నుంచి ఇప్ప‌టివ‌ర‌కు 3,19,23,405 మంది కోలుకున్నారు. 3,76,324 మందికి ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్‌ల‌లో చికిత్స అందుతోంది. 63.43 కోట్ల‌ డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు.

    తెలంగాణలో గడచిన 24 గంటల్లో 58,335 కరోనా పరీక్షలు నిర్వహించగా, 257 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 87 కేసులు నమోదయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్, నారాయణపేట, నిర్మల్ జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 409 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒక మరణం సంభవించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,57,376 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,47,594 మంది ఆరోగ్యవంతులయ్యారు తాజా గణాంకాల నేపథ్యంలో రాష్ట్రంలో 5,912 పాజిటివ్ కేసులు ఉన్నాయి. కరోనా మృతుల సంఖ్య 3,870కి పెరిగింది.

    29-08-2021న ఆంధ్రప్రదేశ్ అధికారులు వెల్లడించిన కరోనా వివరాల ప్రకారం.. ఏపీలో గడచిన 24 గంటల్లో 64,550 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,557 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 255 కొత్త కేసులు నమోదు కాగా, అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 4 కేసులు గుర్తించారు. అదే సమయంలో 1,213 మంది కరోనా నుంచి కోలుకోగా, 18 మంది మరణించారు. తాజా మరణాలతో కలిపి 13,825 కరోనా మరణాలు నమోదయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 20,12,123 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 19,83,119 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 15,179 మంది చికిత్స పొందుతున్నారు.

    Trending Stories

    Related Stories