National

దేశంలో కరోనా కేసుల అప్డేట్స్..!

భారతదేశంలో గత 24గంటల్లో 44,230 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. అదే సమయంలో 42,360 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,15,72,344కు చేరింది. భారత్ లో గత 24 గంటల్లో 555 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దేశంలో మృతుల సంఖ్య మొత్తం 4,23,217కు పెరిగింది. కరోనా నుంచి ఇప్పటివరకు 3,07,43,972 మంది కోలుకున్నారు. 4,05,155 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 45,60,33,754 వ్యాక్సిన్ డోసులు వేశారు.

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1,11,947 కరోనా పరీక్షలు నిర్వహించగా, 623 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 70 కేసులు నమోదవ్వగా నారాయణపేట జిల్లాలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 746 మంది కరోనా నుంచి కోలుకోగా, ముగ్గురు మరణించారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 6,43,716 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,30,732 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 9,188 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,796కి పెరిగింది.

29-07-2021న ఆంధ్రప్రదేశ్ అధికారులు వెల్లడించిన కరోనా వివరాల ప్రకారం.. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 78,784 కరోనా పరీక్షలు నిర్వహించగా 2,107 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 392 కొత్త కేసులు నమోదు కాగా అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 28 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 1,807 మంది కరోనా నుంచి కోలుకోగా, 20 మంది మరణించారు. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 13,332కి చేరింది. ఏపీలో ఇప్పటివరకు 19,62,049 పాజిటివ్ కేసులు నమోదు కాగా 19,27,438 మంది కోలుకున్నారు. ఇంకా 21,279 మందికి చికిత్స జరుగుతోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

one + 4 =

Back to top button