భారతదేశంలో గత 24 గంటల్లో కొత్తగా 3688 మంది కరోనా బారినపడ్డారు. భారతదేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,30,75,864కు చేరింది. ఇందులో 4,25,33,377 మంది బాధితులు కోలుకున్నారు. 5,23,803 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 18,684 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కొత్తగా నమోదైన కేసుల్లో 1607 కేసులు ఢిల్లీలోనే ఉన్నాయి. గత 24 గంటల్లో 2755 మంది కోలుకోగా, 50 మంది మృతిచెందారు. రోజువారీ పాజిటివిటీ రేటు 0.74 శాతానికి పెరింది. 0.04 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.74 శాతం, మరణాలు 1.22 శాతంగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
ఏపీలో గడచిన 24 గంటల్లో 4,577 కరోనా పరీక్షలు నిర్వహించగా 8 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఏలూరు జిల్లాలో 2, విశాఖ జిల్లాలో 2, ప్రకాశం జిల్లాలో 1, అనంతపురం జిల్లాలో 1, బాపట్ల జిల్లాలో 1, తిరుపతి జిల్లాలో 1 కేసు నమోదయ్యాయి. అదే సమయంలో నలుగురు కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా మరణాలేవీ సంభవించలేదు.