More

    దేశంలో కరోనా కేసుల అప్డేట్స్..!

    భారతదేశంలో గత 24 గంటల్లో 9,195 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. అదే సమయంలో 7,347 మంది క‌రోనా నుంచి కోలుకున్నార‌ని.. ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 77,002 మంది చికిత్స తీసుకుంటున్నార‌ని తెలిపింది. ఇప్ప‌టివ‌ర‌కు కోలుకున్న వారి సంఖ్య మొత్తం 3,42,51,292గా ఉంద‌ని తెలిపింది. భారతదేశంలో మొత్తం 143.15 కోట్ల డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు.

    దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్ర‌మంగా పెరుగుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన మొత్తం ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 781గా ఉంది. తెలంగాణ‌లో మొత్తం 62 ఒమిక్రాన్ కేసులు న‌మోదు కాగా, వారిలో 10 మంది కోలుకున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఆరు ఒమిక్రాన్ కేసులు న‌మోదుకాగా, ఒకరు కోలుకున్నారు.

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 30,752 పరీక్షలు చేయగా.. 141 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యధికంగా 27 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 165 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 20,76,687 పాజిటివ్ కేసులు నమోదు కాగా 20,61,122 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,073 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,492కి పెరిగింది.

    Trending Stories

    Related Stories