More

    దేశంలో కరోనా కేసుల అప్డేట్స్

    భారతదేశంలో కొత్త‌గా 8,309 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. అదే సమయంలో 236 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక 9,905 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 544 రోజుల క‌నిష్ఠ‌స్థాయికి చేరుకున్నాయి. ప్ర‌స్తుతం 1,03,859 మంది క‌రోనాకు చికిత్స తీసుకుంటున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 3,40,08,183 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 4,68,790 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 64,02,91,325 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు చేశారు.

    తెలంగాణలో గడచిన 24 గంటల్లో 22,356 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 135 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 62 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 144 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,75,614 పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,68,090 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,535 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,989కి పెరిగింది.

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 27,657 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 178 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా కృష్ణా జిల్లాలో 34 కొత్త కేసులు నమోదు కాగా, అత్యల్పంగా విజయనగరం జిల్లాలో ఒక కేసు నమోదైంది. అదే సమయంలో 190 మంది కరోనా నుంచి కోలుకోగా, ఆరుగురు మరణించారు. తాజా మరణాలతో కలిపి కరోనా మృతుల సంఖ్య 14,438కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,72,624 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 20,56,046 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 2,140 మంది చికిత్స పొందుతున్నారు.

    Trending Stories

    Related Stories