More

    దేశంలో కరోనా కేసుల అప్డేట్స్..!

    భారతదేశంలో కొత్త‌గా 14,348 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. క‌రోనా నుంచి గత 24 గంటల్లో 13,198 మంది కోలుకున్నారు. అదే సమయంలో 805 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,42,46,157కు చేరింది. యాక్టివ్ కేసులు 1,61,334 ఉన్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 3,36,27,632 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య మొత్తం 4,57,191గా ఉంది. దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 1,04,82,00,966 డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు. కేర‌ళ‌లో గత 24 గంటల్లో 7,838 కొత్త క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. అదే సమయంలో 90 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు.

    తెలంగాణ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 38,373 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 171 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 58 కొత్త కేసులు నమోదు కాగా.. వికారాబాద్, నారాయణపేట, ములుగు, మెదక్, కామారెడ్డి, జోగులాంబ గద్వాల్, జయశంకర్ భూపాలపల్లి, జనగామ జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 208 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,71,000 పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,62,922 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 4,126 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,952కి పెరిగింది.

    28-10-2021న ఆంధ్రప్రదేశ్ అధికారులు వెల్లడించిన కరోనా వివరాల ప్రకారం.. ఏపీలో గడచిన 24 గంటల్లో 38,896 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 381 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 82 కొత్త కేసులు నమోదు కాగా, అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 3 కేసులు గుర్తించారు. అదే సమయంలో 414 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 14,365కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,65,235 పాజిటివ్ కేసులు నమోదు కాగా 20,46,127 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,743 మంది చికిత్స పొందుతున్నారు.

    Trending Stories

    Related Stories