National

దేశంలో కరోనా కేసుల వివరాలు

భారతదేశంలో గత 24 గంటల్లో కొత్త‌గా 18,870 మందికి క‌రోనా వైర‌స్‌ సోకింది. తాజా గణాంకాల ప్రకారం దేశంలో క‌రోనా కేసుల సంఖ్య మొత్తం 3,37,16,451కి చేరింది. క‌రోనా నుంచి కొత్త‌గా 28,178 మంది కోలుకోగా ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 3,29,86,180 మంది కోలుకున్నారు. క‌రోనాతో నిన్న‌ 378 మంది ప్రాణాలు కోల్పోవ‌డంతో మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 4,47,751కు చేరింది. ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 2,82,520 మందికి చికిత్స అందుతోంది. కేర‌ళ‌లో నిన్న 11,196 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. 149 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు వినియోగించిన మొత్తం వ్యాక్సిన్ డోసుల సంఖ్య 87,66,63,490 గా ఉంది.

తెలంగాణ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 44,200 కరోనా పరీక్షలు చేపట్టగా, 220 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 80 కొత్త కేసులు నమోదు కాగా.. నిర్మల్, నారాయణపేట, కొమరంభీం ఆసిఫాబాద్, కామారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 255 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,65,504కి చేరింది. 6,57,040 మంది ఆరోగ్యవంతులు కాగా, ఇంకా 4,549 మందికి చికిత్స జరుగుతోంది. కరోనా మృతుల సంఖ్య 3,915కి పెరిగింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారులు 28-09-2021న వెల్లడించిన కరోనా వివరాల ప్రకారం గత 24 గంటల్లో 45,592 మందికి కరోనా పరీక్షలను నిర్వహించగా 771 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 153 కేసులు నమోదు కాగా… విజయనగరం జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదుకాలేదు. ఇదే సమయంలో 1,333 మంది కరోనా నుంచి కోలుకోగా 8 మంది మృతి చెందారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 20,48,230కి పెరిగింది. ఇప్పటి వరకు 20,22,168 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం 14,150 మంది మహమ్మారి వల్ల ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 11,912 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Related Articles

Back to top button