More

    దేశంలో కరోనా కేసుల అప్డేట్స్..!

    భారతదేశంలో గత 24 గంటల్లో 43,509 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,15,28,114కు చేరింది. అదే సమయంలో 38,465 మంది కోలుకున్నారు. 640 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. భారతదేశంలో కరోనా మృతుల సంఖ్య మొత్తం 4,22,662కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,07,01,612 మంది కోలుకున్నారు. 4,03,840 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.

    తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 1,16,815 మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించగా 657 మందికి కరోనా నిర్ధారణ అయిందని అధికారులు తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 77 కేసులు నమోదయ్యాయి. ఇక నారాయణ్ పేట జిల్లాలో కొత్త కేసులేమీ నమోదు కాలేదు. ఇద్దరు కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోగా 578 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 6,43,093కి చేరింది. 6,29,986 మంది కరోనా నుంచి కోలుకోగా… 3,793 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 9,314 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

    28-07-2021 న ఆంధ్రప్రదేశ్ అధికారులు వెల్లడించిన కరోనా వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ లో 24 గంటల్లో 2,010 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 20 మంది మృతి చెందారు. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 386 కేసులు నమోదు కాగా కర్నూలు జిల్లాలో అత్యల్పంగా 10 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల సమయంలో 1,956 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా గణాంకాలతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు 19,59,942 పాజిటివ్ కేసులు నమోదు కాగా 19,25,631 మంది కోలుకున్నారు. 13,312 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 20,999 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

    Related Stories