భారతదేశంలో కరోనా కేసుల అప్డేట్స్..!

0
712

భారతదేశంలో క‌రోనా యాక్టివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉంది. యాక్టివ్ కేసుల సంఖ్య మాత్రం 17 వేల‌ను దాటింది. కొత్త కేసుల కంటే కోలుకుంటున్న వారి సంఖ్య త‌క్కువ‌గా ఉండ‌టంతో యాక్టివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న‌ట్లుగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం దేశంలో 17,087 యాక్టివ్ కేసులున్నాయి. శనివారం నాడు భారతదేశంలో 4,74,309 క‌రోనా నిర్ధారణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా… 2,828 మందికి క‌రోనా పాజిటివ్‌గా తేలారు. గ‌డ‌చిన 24 గంట‌ల్లో క‌రోనా కార‌ణంగా 14 మంది మ‌ర‌ణించారు. దీంతో ఇప్ప‌టిదాకా క‌రోనా కార‌ణంగా మ‌ర‌ణించిన వారి సంఖ్య 5,24, 586కు చేరింది. ఇక క‌రోనా బారిన ప‌డిన వారిలో శ‌నివారం 2,035 మంది కోలుకున్నారు. దీంతో ఇప్ప‌టిదాకా క‌రోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4.26 కోట్ల‌ను దాటింది. దేశంలో ఇప్ప‌టిదాకా వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య 193.28 కోట్ల‌ను దాటింది.