భారతదేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 1,73,790 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అదే సమయంలో 2,84,601 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,77,29,247కు చేరింది. మరో 3,617 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,22,512కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,51,78,011 మంది కోలుకున్నారు. 22,28,724 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.
తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 97,236 కరోనా పరీక్షలు నిర్వహించగా 3,527 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో 519 మంది కొవిడ్ బారినపడ్డారు. నల్గొండ జిల్లాలో 218, ఖమ్మం జిల్లాలో 215, రంగారెడ్డి జిల్లాలో 207 కేసులు నమోదయ్యాయి. నిర్మల్ జిల్లాలో అత్యల్పంగా 15 కేసులు గుర్తించారు. అదే సమయంలో 3,982 మంది కరోనా నుంచి కోలుకోగా, 19 మంది మరణించారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 5,71,044 పాజిటివ్ కేసులు నమోదు కాగా 5,30,025 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 37,793 మందికి చికిత్స జరుగుతోంది. కరోనా మృతుల సంఖ్య 3,226కి చేరింది.
ఆంధ్రప్రదేశ్ లో గడచిన 24 గంటల్లో 84,502 కరోనా పరీక్షలు నిర్వహించగా 14,429 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 2,291 పాజిటివ్ కేసులు నమోదు కాగా, తూర్పు గోదావరి జిల్లాలో 2,022 కేసులు గుర్తించారు. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 535 కొత్త కేసులు వెల్లడయ్యాయి. 20,746 మంది కరోనా నుంచి కోలుకోగా, 103 మంది మరణించారు. చిత్తూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 15 మంది చొప్పున మహమ్మారికి బలయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 16,57,986 పాజిటివ్ కేసులు నమోదు అవ్వగా 14,66,990 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,80,362 మందికి చికిత్స జరుగుతోంది.