More

    దేశంలో కరోనా కేసుల అప్డేట్స్

    భారతదేశంలో గత 24గంటల్లో 2,35,532 పాజిటివ్‌ కేసులు నమోదవగా, 871 మంది మృతిచెందారు. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 4,08,58,241కి చేరగా, మరణాలు 4,93,198కి పెరిగాయి. మొత్తం కేసుల్లో 3,83,60,710 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, మరో 20,04,333 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక గత 24 గంటల్లో 3,35,939 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. యాక్టివ్‌ కేసులు 4.91 శాతం ఉండగా, రోజువారీ పాజిటివిటీ రేటు 13.39 శాతంగా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో ఇప్పటివరకు 1,65,04,87,260 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని కేంద్రం తెలిపింది.

    తెలంగాణలో గడచిన 24 గంటల్లో 1,01,812 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 3,877 కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 1,189 కేసులు నమోదు అయ్యాయి. అదే సమయంలో 2,981 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,54,976 పాజిటివ్ కేసులు నమోదు కాగా 7,10,479 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 40,414 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 4,083కి పెరిగింది.

    ఏపీలో గడచిన 24 గంటల్లో 40,635 కరోనా పరీక్షలు నిర్వహించగా 12,561 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. 12 మంది మరణించారు. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 1,710 కొత్త కేసులు నమోదు అయ్యాయి. విశాఖ జిల్లాలో ముగ్గురు మరణించగా, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో ఇద్దరు చొప్పున, అనంతపురం, చిత్తూరు, విజయనగరం, పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున కరోనాతో కన్నుమూశారు. తాజా మరణాలతో కలిపి ఏపీలో కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 14,591కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 22,48,608 పాజిటివ్ కేసులు నమోదు కాగా 21,20,717 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,13,300 మంది చికిత్స పొందుతున్నారు.

    Trending Stories

    Related Stories