భారతదేశంలో గత 24 గంటల్లో కొత్తగా 18,795 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,36,97,581కు చేరింది. అదే సమయంలో 26,030 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం కోలుకున్న వారి సంఖ్య 32,9,58,002కు చేరింది. గత 24 గంటల్లో 179 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,47,373కు చేరింది. 2,92,206 మంది ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స అందుతోంది. కేరళలో నిన్న 11,699 కరోనా కేసులు నమోదయ్యాయి. 58 మంది మృతి చెందారు. భారత్ లో గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 1,02,22,525 మందికి వ్యాక్సిన్ డోసులు వేశారు. ఇప్పటి వరకు మొత్తం 87,07,08,636 వ్యాక్సిన్ డోసులను వినియోగించారు.
27-09-2021న ఆంధ్రప్రదేశ్ అధికారులు వెల్లడించిన కరోనా వివరాల ప్రకారం.. ఏపీలో గడచిన 24 గంటల్లో 38,069 కరోనా పరీక్షలు నిర్వహించగా, 618 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 122 కరోనా కేసులు నమోదవ్వగా అత్యల్పంగా విజయనగరం జిల్లాలో ఒక పాజిటివ్ కేసును గుర్తించారు. అదే సమయంలో 1,178 మంది కరోనా నుంచి కోలుకోగా, ఆరుగురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,47,459 పాజిటివ్ కేసులు నమోదు కాగా 20,20,835 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 12,482 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 14,142కి పెరిగింది.