దేశంలో కొత్తగా 46,759 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. తాజా లెక్కల ప్రకారం కరోనా కేసుల సంఖ్య మొత్తం 3,26,49,947కి చేరింది. అదే సమయంలో 31,374 మంది కోలుకున్నారని పేర్కొంది. దేశంలో కరోనాతో మరో 509 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,37,370కి పెరిగింది. కరోనా నుంచి ఇప్పటివరకు 3,18,52,802 మంది కోలుకున్నారు. 3,59,775 మందికి ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స అందుతోంది.
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 80,568 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 339 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 91 కొత్త కేసులు నమోదయ్యాయి. కొమరంభీం ఆసిఫాబాద్, మెదక్, నారాయణపేట జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 417 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,56,794 పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,46,761 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 6,166 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,867కి చేరింది.
27-08-2021న ఆంధ్రప్రదేశ్ అధికారులు వెల్లడించిన కరోనా వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో 68,865 మందికి కోవిడ్ పరీక్షలను నిర్వహించగా కొత్తగా 1,515 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 13,788కి పెరిగింది. తాజా కేసులతో పాటు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 20,09,245కి చేరింది. వీరిలో 19,80,407 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 15,050 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.