National

దేశంలో కరోనా కేసుల అప్డేట్స్..!

భారతదేశంలో గత 24 గంటల్లో 43,654 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,14,84,605కు చేరింది. అదే సమయంలో 41,678 మంది కోలుకున్నారు. 640 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో భారతదేశంలో కరోనా మృతుల సంఖ్య మొత్తం 4,22,022కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,06,63,147 మంది కోలుకున్నారు. 3,99,436 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 44,61,56,659 వ్యాక్సిన్ డోసులు వేశారు.

తెలంగాణ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 1,23,166 పరీక్షలు చేయగా.. 645 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఖమ్మం జిల్లాలో 72, జీహెచ్ఎంసీ పరిధిలో 72 కొత్త కేసులు నమోదయ్యాయి. నారాయణపేట్ జిల్లాలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 729 మంది కరోనా నుంచి కోలుకోగా, నలుగురు మరణించారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 6,42,436 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,29,408 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 9,237 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,791కి పెరిగింది.

27-07-2021న ఆంధ్రప్రదేశ్ అధికారులు వెల్లడించిన కరోనా వివరాల ప్రకారం.. ఏపీలో గత 24 గంటల్లో 1,540 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. 2,304 మంది కరోనా నుంచి కోలుకోగా 19 మంది మృతి చెందారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 280 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 19,57,932 కేసులు నమోదు కాగా 19,23,675 మంది కోలుకున్నారు. మొత్తం 13,292 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 20,965 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

one × three =

Back to top button