దేశంలో కరోనా కేసుల అప్డేట్స్

0
761

భారతదేశంలో గడచిన 24 గంట్లలో 17, 073 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం వెల్లడించింది. మూడు రోజుల కిందట కూడా 17వేల పైచిలుకు కేసులు వచ్చాయి. ఫిబ్రవరి తర్వాత ఇన్ని కేసులు రావడం ఈ నాలుగు నెలల్లో మొదటిసారి. ఇక, గడచిన 24 గంటల్లో కరోనాతో 21 మంది మృతి చెందారని ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో కరోనా మరణాల సంఖ్య 5,25,020కి చేరుకుంది. మరణాల రేటు 1.21 శాతంగా నమోదైంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 94, 420 యాక్టిక్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి గడచిన 24 గంటల్లో 15, 208 మంది కోలుకున్నారు. దాంతో, వైరస్ నుంచి బయటపడిన వారి సంఖ్య 4,27,87,606కి చేరుకుంది. రికవరీ రేటు 98.57 శాతంగా ఉంది. దేశంలో ఇప్పటిదాకా 197 కోట్ల పైచిలుకు కరోనా వ్యాక్సిన్లు అందజేశారు.

తెలంగాణలో గ‌డిచిన‌ 24 గంటల్లో 23,979 క‌రోనా శాంపిల్స్ ప‌రీక్షించ‌గా.. 434 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 3,762 ఉండగా.. ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 7,99,055గా ఉంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి)లో గత 24 గంటల్లో అత్యధికంగా 343 కేసులు నమోదయ్యాయి, రంగారెడ్డి (34), మేడ్చల్ మల్కాజిగిరి (25) అత్య‌ధికంగా కేసులు న‌మోద‌య్యాయి. 24 గంటల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 285 మంది కరోనావైరస్ నుండి కోలుకున్నారు, రికవరీ రేటు 99.01%గా ఉంది.