భారతదేశంలో గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 8,318 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,45,63,749కి చేరాయి. ఇందులో 1,07,019 కేసులు యాక్టివ్‌గా ఉండగా.. 3,39,88,797 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో 4,67,933 మంది వైరస్‌కు బలయ్యారు. గత 24 గంటల్లో కొత్తగా 10,967 మంది మహమ్మారి నుంచి కోలుకోగా, 465 మంది మృతిచెందారు. కొత్తగా నమోదైన కేసుల్లో కేరళలోనే 4,677 కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న 388 మంది మరణించారని ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక దేశంలో 121.06 కోట్ల డోసులను పంపిణీ చేశామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 38,731 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 171 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఒక్క గ్రేటర్ హైదరాబాదు పరిధిలోనే 75 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 167 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,75,319 పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,67,798 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,534 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,987కి పెరిగింది.
ఏపీలో గత 24 గంటల్లో 29,731 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 184 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 36 కేసులు నమోదు కాగా.. కర్నూలు జిల్లాలో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. అదే సమయంలో 214 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,72,198 పాజిటివ్ కేసులు నమోదు కాగా 20,55,603 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 2,163 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,432కి పెరిగింది.