భారతదేశంలో కొత్తగా 26,041 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,36,78,786కు పెరిగింది. అదే సమయంలో కరోనా నుంచి కొత్తగా 29,621 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య మొత్తం 3,29,31,972కు చేరింది. గత 24 గంటల్లో 276 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మరణాల సంఖ్య 4,47,194కు పెరిగింది. ప్రస్తుతం దేశంలో 2,99,620 మందికి ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స అందుతోంది. దేశంలో ఇప్పటి వరకూ 86,01,59,011 వ్యాక్సిన్లు వేశారు. కేరళలో కరోనా ఉధృతి ఏ మాత్రం తగ్గడం లేదు. గత 24 గంటల్లో అక్కడ 15,951 కేసులు నమోదయ్యాయి. 165 మంది ప్రాణాలు కోల్పోయారు.
26-09-2021న ఆంధ్రప్రదేశ్ అధికారులు వెల్లడించిన కరోనా వివరాల ప్రకారం ఏపీలో గడచిన 24 గంటల్లో 58,545 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,184 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 218 కొత్త కేసులు నమోదు కాగా, అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 3 పాజిటివ్ కేసులు గుర్తించారు. అదే సమయంలో 1,333 మంది కరోనా నుంచి కోలుకోగా, 11 మంది మరణించారు. తాజా మరణాలతో కలిపి రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 14,136కి పెరిగింది. ఏపీలో ఇప్పటివరకు 20,46,841 పాజిటివ్ కేసులు నమోదు కాగా 20,19,657 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 13,048 మంది చికిత్స పొందుతున్నారు.
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 34,200 కరోనా పరీక్షలు నిర్వహించగా 170 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 68 కొత్త కేసులు వెల్లడయ్యాయి. జోగులాంబ గద్వాల్, కామారెడ్డి, కొమరంభీం ఆసిఫాబాద్, నాగర్ కర్నూల్, నిర్మల్, నారాయణపేట, నిజామాబాద్, వనపర్తి జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 259 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఒక్క మరణం కూడా సంభవించలేదు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 6,65,068 పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,56,544 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,612 మంది చికిత్స పొందుతున్నారు.