More

    రోజు రోజుకీ పెరుగుతున్న కరోనా కేసులు

    భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. మంగళవారం 2483 కేసులు నమోదవగా, అవి మూడువేలకు చేరువయ్యాయి. దేశంలో కొత్తగా 2927 మందికి పాజిటివ్‌ వచ్చింది. భారతదేశంలో మొత్తం కేసులు 4,30,65,496కు చేరగా.. 4,25,25,563 మంది కోలుకున్నారు. మరో 16,279 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 5,23,654 మంది బాధితులు కోలుకున్నారు. గత 24 గంటల్లో 2252 మంది కోలుకోగా, 32 మంది మృతిచెందారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం కరోనా కేసుల్లో 0.04 శాతం కేసులు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాయని తెలిపింది. రికవరీ రేటు 98.75 శాతం, మరణాలు 1.22 శాతంగా ఉన్నాయి. ఇక రోజువారీ పాజిటివిటీ రేటు 0.58 శాతానికి పెరిగింది.

    తెలంగాణలో గడచిన 24 గంటల్లో 15,633 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 30 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా హైదరాబాదు జిల్లాలో 17 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 24 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా ఎలాంటి మరణాలు సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటివరకు 7,91,857 పాజిటివ్ కేసులు నమోదు కాగా 7,87,508 మంది కోలుకున్నారు. ఇంకా 238 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మరణించారు.

    ఏపీలో గడచిన 24 గంటల్లో 3,595 కరోనా పరీక్షలు నిర్వహించగా, 4 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. ఎన్టీఆర్ జిల్లాలో 3 కేసులు, కృష్ణా జిల్లాలో 1 కేసు నమోదయ్యాయి. అదే సమయంలో 8 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 14,730 మంది కరోనాతో మరణించారు.

    Trending Stories

    Related Stories