More

    దేశంలో కరోనా కేసుల అప్డేట్స్..!

    భారతదేశంలో గత 24 గంటల్లో 2,86,384 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.అదే సమయంలో 573 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో క‌రోనా నుంచి 3,06,357 మంది కోలుకున్న‌ట్లు వివ‌రించింది. ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 22,02,472 మందికి చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 1,63,84,39,207 డోసుల వ్యాక్సిన్లు వేశారు. దేశంలో క‌రోనాతో మొత్తం 4,91,700 మంది మృతి చెందారు.

    తెలంగాణలో గత 24 గంటల్లో 3,801 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇదే సమయంలో 2,046 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కారణంగా ఒకరు మృతి చెందారు. జీహెచ్ఎంసీ పరిధిలో 1,570 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 38,023 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 94.37 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 88,867 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.

    ఆంధ్రప్రదేశ్ లో గత 24 గంటల్లో 13,618 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. విశాఖపట్నం జిల్లాలో అత్యధికంగా 1,791 కేసులు నమోదు అయ్యాయి. ఇదే సమయంలో తొమ్మిది మంది మరణించారు. గత 24 గంటల్లో 8,687 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం కేసుల సంఖ్య 22,22,573కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 21,01,685 మంది కోలుకోగా, 14,570 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,06,318కి పెరిగాయి.

    Trending Stories

    Related Stories