దేశంలో గత 24 గంటల్లో 10,549 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో కరోనాతో 488 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా నుంచి మరో 9,868 మంది కోలుకున్నారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో కరోనాకు 1,10,133 మంది చికిత్స తీసుకుంటున్నారు. మొత్తం కేసుల సంఖ్య 3,45,55,431కు చేరింది. ఇప్పటి వరకు కరోనా నుంచి 3,39,77,830 మంది కోలుకున్నారు. మొత్తం మృతుల సంఖ్య 4,67,468కు చేరింది.
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 33,836 కరోనా పరీక్షలు నిర్వహించగా, 147 కొత్త కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 56 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అదే సమయంలో 148 కరోనా నుంచి కోలుకున్నారు. ఒక మరణం సంభవించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,75,148 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 6,67,631 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,531 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,986కి పెరిగింది.
ఏపీలో గడచిన 24 గంటల్లో 30,863 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 183 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 30 కొత్త కేసులు నమోదు కాగా, అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 1 కేసు గుర్తించారు. అదే సమయంలో 163 మంది కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,72,014 పాజిటివ్ కేసులు నమోదు కాగా 20,55,389 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 2,194 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 14,431కి పెరిగింది.