National

దేశంలో కరోనా కేసుల అప్డేట్స్..!

భారతదేశంలో గత 24 గంటల్లో కొత్తగా 39,361 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,14,11,262కు చేరింది. అదే సమయంలో 35,968 మంది కోలుకున్నారు. గత 24 గంటల్లో 416 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. భారతదేశంలో మృతుల సంఖ్య మొత్తం 4,20,967కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,05,79,106 మంది కోలుకున్నారు. 4,11,189 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 43,51,96,001 వ్యాక్సిన్ డోసులు వేశారు.

25-07-2021న ఆంధ్రప్రదేశ్ అధికారులు వెల్లడించిన కరోనా వివరాల ప్రకారం.. ఏపీలో గడచిన 24 గంటల్లో 84,858 కరోనా పరీక్షలు నిర్వహించగా 2,252 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 385 కొత్త కేసులు నమోదు కాగా అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 27 కేసులు గుర్తించారు. అదే సమయంలో 2,440 మంది కరోనా నుంచి కోలుకోగా, 15 మంది మృతి చెందారు. ఇప్పటి వరకూ ఏపీలో 13,256 మంది కరోనాతో కన్నుమూశారు. 19,54,765 పాజిటివ్ కేసులు ఏపీలో నమోదు కాగా 19,19,354 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 22,155 మందికి చికిత్స జరుగుతోంది.

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 91,457 కరోనా పరీక్షలు నిర్వహించగా 494 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. గ్రేటర్ హైదరాబాదు పరిధిలో అత్యధికంగా 76 కేసులు నమోదవ్వగా.. నిర్మల్, కొమరంభీమ్ ఆసిఫాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 710 మంది కరోనా నుంచి కోలుకోగా, నలుగురు మరణించారు. కరోనా మృతుల సంఖ్య 3,784కి పెరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 6,41,153 పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,27,964 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 9,405 మందికి చికిత్స కొనసాగుతోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

eighteen − nine =

Back to top button