భారత్ లో కరోనా కేసుల అప్డేట్స్.. మరింత తగ్గిన కరోనా కేసులు..!

0
741

భారతదేశంలో కరోనా కేసుల సంఖ్య ఇంత తగ్గుతూ ఉంది. భార‌త్‌లో గత 24 గంటల్లో 48,698 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. అదే సమయంలో 64,818 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,01,83,143కు చేరింది. నిన్న‌ 1,183 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,94,493కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,91,93,085 మంది కోలుకున్నారు. 5,95,565 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 1,20,397 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,061 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 135 కేసులు నమోదు అవ్వగా.. కరీంనగర్ జిల్లాలో 80, సూర్యాపేట జిల్లాలో 67, రంగారెడ్డి జిల్లాలో 66, నల్గొండ జిల్లాలో 65 కేసులు గుర్తించారు. అదే సమయంలో 1,556 మంది కోలుకోగా, 11 మంది మరణించారు. తాజా మరణాలతో కలిపి రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 3,618కి పెరిగింది. తెలంగాణలో ఇప్పటివరకు 6,18,837 పాజిటివ్ కేసులు నమోదు కాగా 5,99,695 మంది కోలుకున్నారు. ఇంకా 15,524 మందికి చికిత్స జరుగుతోంది.

25-06-2021న ఆంధ్రప్రదేశ్ అధికారులు వెల్లడించిన కరోనా వివరాల ప్రకారం.. ఏపీలో గత 24 గంటల్లో 4,458 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 909 కేసులు నమోదయ్యాయి. విజయనగరంలో అత్యల్పంగా 64 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 6,313 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో మహమ్మారి వల్ల 38 మంది మృతి చెందారు. చిత్తూరు జిల్లాలో తొమ్మిది మంది చనిపోయారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 18,71,475 కరోనా కేసులు నమోదవ్వగా 18,11,157 మంది కోలుకున్నారు. 12,528 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 47,790 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

19 + nineteen =