ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనాకు కట్టడికి తీసుకుంటున్న చర్యలు ఫలితాలనివ్వడం లేదు. గత 24 గంటల్లో ఏకంగా 18,285 మందికి కరోనా నిర్ధారణ అయింది. ఇదే సమయంలో 99 మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 15 మంది, పశ్చిమ గోదావరి జిల్లాలో 14 మంది, విజయనగరం జిల్లాలో 9 మంది చనిపోయారు. ఇదే సమయంలో 24,105 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1,92,104 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 16,27,390కి చేరుకుంది. 14,24,859 మంది కోలుకున్నారు. మొత్తం 10,427 మంది మృతి చెందారు.
భారతదేశంలో కరోనా కేసులకు సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటి వరకూ 11,717 కేసులు నమోదయ్యాయని కేంద్రం తెలిపింది. అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రాల జాబితాలో గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. గుజరాత్ లో 2,859 కేసులు, మహారాష్ట్రలో 2,770, ఏపీలో 768 కేసులు నమోదయ్యాయి.