దేశంలో కరోనా కేసుల అప్డేట్స్

0
870

భారతదేశంలో గత 24 గంటల్లో 2,85,914 కేసులు న‌మోద‌య్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. గత 24 గంటల్లో క‌రోనాతో 665 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో క‌రోనా నుంచి 2,99,073 మంది కోలుకున్నారు. ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 22,23,018 మంది చికిత్స పొందుతున్నారు. రోజువారీ పాజిటివిటీ రేటు 16.16 శాతంగా ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 1,63,58,44,536 వ్యాక్సిన్ డోసులు వేశారు.

తెలంగాణలో గత 24 గంటల్లో 1,13,670 కరోనా పరీక్షలు నిర్వహించగా 4,559 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1,450 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 1,961 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,43,354 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 7,03,008 మంది కోలుకున్నారు. ఇంకా 36,269 మందికి చికిత్స జరుగుతోంది. కరోనా మృతుల సంఖ్య 4,077కి పెరిగింది.

ఏపీలో గడచిన 24 గంటల్లో 46,929 కరోనా పరీక్షలు నిర్వహించగా 13,819 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా విశాఖ జిల్లాలో 1,988 కొత్త కేసులు నమోదు అయ్యాయి. అదే సమయంలో 5,716 మంది కరోనా నుంచి కోలుకోగా, 12 మంది మరణించారు. తాజా మరణాలతో కలిపి ఏపీలో కరోనా మృతుల సంఖ్య 14,561కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 22,08,955 పాజిటివ్ కేసులు నమోదు కాగా 20,92,998 మంది కోలుకున్నారు. ఏపీలో ప్రస్తుతం 1,01,396 యాక్టివ్ కేసులు ఉన్నాయి.