భారత దేశంలో కరోనా కేసుల సంఖ్య మరింత తగ్గుతూ ఉంది. దేశంలో కొత్తగా 9,119 కరోనా కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో కరోనా నుంచి 10,264 మంది కోలుకున్నారు. కరోనాతో మరో 396 మంది ప్రాణాలు కోల్పోయారు. యాక్టివ్ కేసుల సంఖ్య 539 రోజుల కనిష్ఠానికి చేరుకుంది. ప్రస్తుతం దేశంలో కరోనాతో 1,09,940 మంది చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు మొత్తం 3,39,67,962 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనాతో మొత్తం 4,66,980 మంది మృతి చెందారు. దేశంలో నిన్నటి వరకు మొత్తం 119,38,44,741 డోసుల వ్యాక్సిన్ వేశారు.
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 34,764 కరోనా పరీక్షలు నిర్వహించగా, 156 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 55 కొత్త కేసులు నమోదు అయ్యాయి. అదే సమయంలో 155 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,75,001 పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,67,483 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,533 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 3,985కి పెరిగింది.
ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 264 మంది కరోనా బారిన పడ్డారు. కృష్ణా జిల్లాలో ఒక మరణం నమోదైంది. కరోనా నుంచి పూర్తిగా కోలుకుని 247 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా గత 24 గంటల్లో 31,987 మందిని పరీక్షించారు. తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 20,71,831కి పెరగ్గా, 14,430 మంది మరణించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకా 2,175 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 46 కేసులు నమోదయ్యాయి, కర్నూలు జిల్లాలో అత్యల్పంగా మూడు కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో నిర్వహించిన కొవిడ్ పరీక్షల సంఖ్య 3,02,55,667కి పెరిగింది.