National

దేశంలో కరోనా కేసుల అప్డేట్స్

భారతదేశంలో గత 24 గంటల్లో కొత్తగా 14,306 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 443 మంది మహమ్మారి కారణంగా మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 1,67,695 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 239 రోజుల్లో అతి తక్కువ యాక్టివ్ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. కేరళ రాష్ట్రంలో కరోనా ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. కేరళలో గత 24 గంటల్లో 8,538 కేసులు నమోదు కాగా… 71 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి ఇండియాలో కరోనా కేసుల సంఖ్య 3,41,89,774కి పెరిగాయి. ఇప్పటి వరకు 4,54,712 మంది కరోనా కారణంగా మృతి చెందారు.

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 26,842 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 135 మందికి పాజిటివ్ అని వెల్లడైంది. జీహెచ్ఎంసీలో అత్యధికంగా 64 కొత్త కేసులు నమోదు కాగా, వనపర్తి, వికారాబాద్, నిజామాబాద్, నిర్మల్, నారాయణపేట, ములుగు, కొమరంభీం ఆసిఫాబాద్, కామారెడ్డి, జోగులాంబ గద్వాల్, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, ఆదిలాబాద్ జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 168 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. కరోనా మృతుల సంఖ్య 3,947కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,70,274 పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,62,377 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,950 మంది చికిత్స పొందుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 37,744 కరోనా నిర్ధారణ పరీక్షలు చేపట్టగా, 400 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 73 కొత్త కేసులు నమోదు కాగా, అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 3 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 516 మంది కరోనా నుంచి కోలుకోగా, నలుగురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,63,577 పాజిటివ్ కేసులు నమోదు కాగా 20,44,132 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 5,102 మందికి చికిత్స జరుగుతోంది. కరోనా మృతుల సంఖ్య 14,343కి పెరిగింది.

Related Articles

Back to top button