భారతదేశంలో గత 24 గంటల్లో 37,593 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,25,12,366కు చేరింది. అదే సమయంలో కరోనా నుంచి 34,169 మంది కోలుకోగా, 648 మంది మృతి చెందారు. దేశంలో కరోనా మృతుల సంఖ్య మొత్తం 4,35,758కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,17,54,281 మంది కోలుకున్నారు. 3,22,327 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. భారత్ లో ఇప్పటివరకు మొత్తం 59,55,04,593 డోసుల వ్యాక్సిన్లు వేసినట్టు అధికారులు ప్రకటించారు.
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 88,347 కరోనా పరీక్షలు నిర్వహించగా, 389 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 70 కేసులు నమోదు కాగా, నిర్మల్ జిల్లాలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 420 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 6,55,732 పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,45,594 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 6,276 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,862కి చేరింది.
24-08-2021న ఆంధ్రప్రదేశ్ అధికారులు వెల్లడించిన కరోనా వివరాల ప్రకారం ఏపీలో గడచిన 24 గంటల్లో 58,890 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,248 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయిందని అధికారులు స్పష్టం చేశారు. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 238 కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా కడప జిల్లాలో 19 కేసులను గుర్తించారు. అదే సమయంలో 1,715 మంది కరోనా నుంచి కోలుకోగా, 15 మంది మరణించారు. ఇక రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 20,04,590 పాజిటివ్ కేసులు నమోదు కాగా 19,77,163 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 13,677 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మరణాల సంఖ్య 13,750కి పెరిగింది.