భారతదేశంలో గత 24 గంటల్లో 16,866 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 18,148 మంది కరోనా నుంచి కోలుకోగా… 41 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 1,50,877 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 7.03 శాతంగా ఉంది. ఇప్పటి వరకు 4,32,28,670 మంది కరోనా నుంచి కోలుకోగా.. 5,26,074 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో క్రియాశీల రేటు 0.34 శాతంగా, రికవరీ రేటు 98.46 శాతంగా, మరణాల రేటు 1.20 శాతంగా ఉన్నాయి. ఇప్పటి వరకు 2,02,17,66,615 డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 24,927 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 531 కొత్త కేసులు నమోదయ్యాయి. హైదరాబాదులో 281, రంగారెడ్డి జిల్లాలో 42, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 34 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 612 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటిదాకా 8,14,303 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 8,05,562 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,630 మంది చికిత్స పొందుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మృతి చెందారు.