భారతదేశంలో కరోనా కేసుల అప్డేట్స్

0
801

భారతదేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గత 24 గంటల్లో కరోనా కేసులు 15,940 నమోదయ్యాయి.. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,33,78,234కు చేరింది. ఇందులో 4,27,61,481 మంది బాధితులు కోలుకోగా 5,24,974 మంది మరణించారు. మరో 91,779 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో 20 మంది మరణించగా 12,425 మంది డిశ్చార్జీ అయ్యారు. యాక్టివిటీ రేటు 0.21 శాతానికి పెరిగింది. రికరీ రేటు 98.58 శాతం, మరణాల రేటు 1.21 శాతంగా ఉన్నాయని, రోజువారీ పాజిటివిటీ రేటు 4.39 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక దేశవ్యాప్తంగా 196.94 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశారు.

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 29,084 కరోనా పరీక్షలు నిర్వహించగా, 493 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా హైదరాబాదులో 366 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 40, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 34 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 219 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటిదాకా 7,98,125 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా… 7,90,692 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇంకా 3,322 మంది చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో ఇప్పటివరకు 4,111 మంది కరోనాతో మృతి చెందారు.