National

భారతదేశంలో కరోనా కేసుల అప్డేట్స్

భారతదేశంలో గత 24 గంటల్లో 51,667 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. అదే సమయంలో 64,527 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,01,34,445కు చేరింది. భారత్ లో గత 24 గంటల్లో 1,329మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,93,310కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,91,28,267 మంది కోలుకున్నారు.6,12,868 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. మొత్తం 30,79,48,744 వ్యాక్సిన్ డోసులు వేశారు.

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 1,19,466 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,088 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 137 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. అత్యల్పంగా ఆదిలాబాద్, కామారెడ్డి జిల్లాల్లో 2 చొప్పున కొత్త కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 1,511 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులు కాగా 9 మంది మరణించారు. రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 3,607కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,17,776 పాజిటివ్ కేసులు నమోదు అవ్వగా 5,98,139 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 16,030 మంది చికిత్స పొందుతున్నారు.

24-06-2021న ఆంధ్రప్రదేశ్ అధికారులు వెల్లడించిన కరోనా వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో 88,622 కరోనా పరీక్షలు నిర్వహించగా 4,981 మందికి పాజిటివ్ గా వెల్లడైంది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 943 కొత్త కేసులు నమోదయ్యాయి. విజయనగరం జిల్లాలో అత్యల్పంగా 60 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 6,464 మంది కరోనా నుంచి కోలుకోగా, 38 మంది కన్నుమూశారు. తాజా మరణాలతో కలిపి ఏపీలో ఇప్పటివరకు 12,490 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 18,67,017 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 18,04,844 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 49,683 మంది చికిత్స పొందుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

11 − 1 =

Back to top button