2 లక్షల కంటే తక్కువ నమోదవుతున్న కరోనా కేసులు

భారతదేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. రెండు లక్షల కంటే తక్కువ కేసులు గత 24 గంటల్లో నమోదయ్యాయి. నాలుగు లక్షలకు పైగా కరోనా కేసులు నమోదవ్వడం కూడా మనం చూశాం. ఇప్పుడు రెండు లక్షలకు దిగువున కరోనా కేసులు నమోదవుతూ ఉన్నాయి. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు లాక్ డౌన్ విధించచడం, కర్ఫ్యూలని అమలు చేస్తూ ఉండడంతో కరోనా వ్యాప్తి కట్టడిలోకి వచ్చింది. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1,96,427 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో మహమ్మారి నుంచి 3,26,850 మంది కోలుకున్నారు. దేశ వ్యాప్తంగా 3,511 మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు దేశంలో 2,69,48,874 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 2,40,54,861 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు చనిపోయినవారి సంఖ్య 3,07,231కి చేరింది. ప్రస్తుతం దేశంలో 25,86,782 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 19,85,38,999 మందికి వ్యాక్సిన్ వేశారు.
24-05-2021న తెలంగాణ అధికారులు అందించిన కరోనా వివరాల ప్రకారం.. తెలంగాణలో గడచిన 24 గంటల్లో 59,709 కరోనా పరీక్షలు నిర్వహించగా 3,043 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీలో 424 కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా నిర్మల్ జిల్లాలో 17 కేసులు గుర్తించారు. అదే సమయంలో 4,693 మంది కొవిడ్ నుంచి కోలుకోగా, 21 మంది మరణించారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 5,56,320 పాజిటివ్ కేసులు నమోదు కాగా 5,13,968 మంది కరోనాను జయించారు. ఇంకా 39,206 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 3,146కి పెరిగింది.