More

    తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు.. బ్లాక్ ఫంగస్ కేసులపై అప్డేట్స్

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 72,979 కరోనా పరీక్షలు నిర్వహించగా… 15,284 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. తూర్పు గోదావరి జిల్లాలో 2,663 కొత్త కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 1,970 కేసులు, విశాఖ జిల్లాలో 1,840 కేసులు గుర్తించారు. అత్యల్పంగా కడప జిల్లాలో 436 మందికి కరోనా సోకినట్టు వెల్లడైంది. ఒక్కరోజులో 106 మంది మృత్యువాత పడ్డారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 15 మంది చనిపోగా, ప్రకాశం జిల్లాలో 11 మంది, పశ్చిమ గోదావరి జిల్లాలో 10 మంది కరోనాతో కన్నుమూశారు. ఆంధ్రప్రదేశ్రా ష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 10,328కి చేరింది. అదే సమయంలో 20,917 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 16,09,105 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 14,00,754 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,98,023 మందికి చికిత్స జరుగుతోంది.

    తెలంగాణ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 81,203 కరోనా పరీక్షలు నిర్వహించగా 3,821 మందికి పాజిటివ్ అని వెల్లడైంది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 537 కేసులు నమోదు అయ్యాయి. ఖమ్మం జిల్లాలో 245, రంగారెడ్డి జిల్లాలో 226 కేసులు గుర్తించారు. అదే సమయంలో 4,298 మంది కరోనా నుంచి కోలుకోగా, 23 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 5,60,141 పాజిటివ్ కేసులు నమోదు కాగా 5,18,266 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 38,706 మందికి చికిత్స జరుగుతోంది.

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ గురించి వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో 252 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయని.. బ్లాక్ ఫంగస్ చికిత్స కోసం ఇంజెక్షన్లను అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. ఇప్పటికే 3 వేల ఇంజెక్షన్లను జిల్లాలకు పంపామని తెలిపారు. రాష్ట్రంలో రెమ్ డెసివిర్ కొరత లేదని సింఘాల్ తెలిపారు.

    Trending Stories

    Related Stories