More

    తగ్గుతున్న కరోనా కేసులు.. దేశంలో కరోనా కేసుల అప్డేట్స్

    దేశంలో క‌రోనా కేసుల సంఖ్య కాస్త తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. గత 24 గంటల్లో దేశంలో 2,55,874 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో క‌రోనాతో 614 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో 2,67,753 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 22,36,842 మంది చికిత్స తీసుకుంటున్నారు. రోజువారీ పాజిటివిటీ రేటు 15.52 శాతంగా ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 3,97,99,202 కేసులు న‌మోద‌య్యాయి. మృతుల సంఖ్య‌ 4,90,462కు పెరిగింది.

    ఏపీలో గడచిన 24 గంటల్లో 40,266 శాంపిల్స్ పరీక్షించగా 14,502 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా విశాఖ జిల్లాలో 1,728 కొత్త కేసులు నమోదు అయ్యాయి. అదే సమయంలో 4,800 మంది కరోనా నుంచి కోలుకోగా, ఏడుగురు మరణించారు. తాజా మరణాలతో కలిపి రాష్ట్రంలో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 14,549కి పెరిగింది. ఏపీలో ఇప్పటివరకు 21,95,136 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 20,87,282 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 93,305 మంది చికిత్స పొందుతున్నారు.

    తెలంగాణ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 97,113 మందికి కరోనా పరీక్షలు చేయగా.. 3,980 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాదులో 1,439 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 2,398 మంది కరోనా నుంచి కోలుకోగా, ముగ్గురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,38,795 పాజిటివ్ కేసులు నమోదు కాగా 7,01,047 మంది కోలుకున్నారు. ఇంకా 33,673 మంది చికిత్స పొందుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,075కి పెరిగింది.

    Trending Stories

    Related Stories