భారతదేశంలో గడచిన 24 గంటల్లో దేశం మొత్తమ్మీద 9,283 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 10,949 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒక్కరోజు వ్యవధిలో 437 మరణాలు సంభవించాయి. తాజా మరణాలతో కలిపి దేశంలో ఇప్పటివరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 4,66,584కి పెరిగింది. యాక్టివ్ కేసుల సంఖ్య 1,11,481 చేరుకుంది. 537 రోజుల తర్వాత దేశంలో యాక్టివ్ కేసులు ఈ స్థాయికి దిగిరావడం ఇదే ప్రథమం.
తెలంగాణ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో వ్యాప్తంగా 36,570 కరోనా పరీక్షలు నిర్వహించగా, 153 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 60 కొత్త కేసులు నమోదు అయ్యాయి. అదే సమయంలో 157 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,74,845 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 6,67,328 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,533 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 3,984కి పెరిగింది.
ఏపీలో గడచిన 24 గంటల్లో 26,119 కరోనా పరీక్షలు నిర్వహించగా, 196 మందికి పాజిటివ్ అని తేలింది. కృష్ణా జిల్లాలో అత్యధికంగా 34 కొత్త కేసులు నమోదు కాగా, అత్యల్పంగా అనంతపురం జిల్లాలో 3 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 242 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,71,567 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 20,54,979 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 2,159 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 14,429కి పెరిగింది.