National

దేశంలో కరోనా కేసుల అప్డేట్స్..!

దేశంలో కొత్త‌గా 31,382 కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య‌, ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో 32,542 మంది క‌రోనా నుంచి కోలు కున్నారు. మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3,28,48,273కు చేరింది. అదే సమయంలో 318 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,46,368కు చేరింది. దేశంలో 3,00,162 మంది ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో చికిత్స పొందుతున్నారు. దేశంలో నిన్న 72,20,642 వ్యాక్సిన్ డోసులు వినియోగించారు. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు వేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య‌ 84,15,18,026 కు చేరింది. కేర‌ళ‌లో నిన్న 19,682 కేసులు న‌మోదు కాగా, 152 మంది ప్రాణాలు కోల్పోయారు.

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 51,521 కరోనా పరీక్షలు నిర్వహించగా, 247 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో 71 కొత్త కేసులు నమోదు కాగా నారాయణపేట, కొమరంభీం ఆసిఫాబాద్, కామారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 315 మంది ఆరోగ్యవంతులు కాగా, ఒక మరణం సంభవించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,64,411 పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,55,625 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,877 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మరణాల సంఖ్య 3,909కి పెరిగింది.

23-09-2021న ఆంధ్రప్రదేశ్ అధికారులు వెల్లడించిన కరోనా వివరాల ప్రకారం గత 24 గంటల్లో ఏపీలో కొత్తగా 1,171 కేసులు నమోదయ్యాయి. వీటిలో తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 255 కేసులు నమోదయ్యాయి. అనంతపురం జిల్లాలో అత్యల్పంగా 6 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 1,207 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 11 మంది మృతి చెందారు. ప్రస్తుత కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 20,43,244కి పెరిగాయి. ఇప్పటి వరకు 20,15,387 మంది కోలుకోగా 14,108 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 13,749 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Related Articles

Back to top button