More

    దేశంలో కరోనా కేసుల అప్డేట్స్..!

    దేశంలో గత 24 గంటల్లో 25,467 కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,24,74,773కు చేరింది. గత 24 గంటల్లో క‌రోనా నుంచి 39,486 మంది కోలుకోగా.. 354 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య మొత్తం 4,35,110కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,17,20,112 మంది కోలుకున్నారు. 3,19,551 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 58,89,97,805 డోసుల వ్యాక్సిన్లు వేసినట్టు అధికారులు ప్ర‌క‌టించారు.

    తెలంగాణలో గడచిన 24 గంటల్లో 74,634 కరోనా పరీక్షలు నిర్వహించగా, 354 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 57 కొత్త కేసులు నమోదు కాగా, నారాయణపేట, నిర్మల్ జిల్లాలలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 427 మంది కరోనా నుంచి కోలుకోగా, ముగ్గురు మరణించారు. తాజా మరణాలతో కలిపి కరోనా మృతుల సంఖ్య 3,861కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటిదాకా 6,55,343 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,45,174 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 6,308 మందికి చికిత్స జరుగుతోంది.

    23-08-2021న ఆంధ్రప్రదేశ్ అధికారులు వెల్లడించిన కరోనా వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 1,002 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 265 కేసులు నమోదు కాగా.. కర్నూలు జిల్లాలో అత్యల్పంగా 7 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 1,508 మంది కరోనా నుంచి కోలుకోగా 12 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 14,159 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 20,03,342 కేసులు నమోదు కాగా 19,75,448 మంది కోలుకున్నారు. మొత్తం 13,735 మంది మృతి చెందారు.

    Related Stories