దేశంలో కరోనా కేసుల అప్డేట్స్..!

0
759

భారతదేశంలో కొత్తగా 20,279 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,38,88,755కు చేరాయి. ఇందులో 4,32,10,522 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,26,033 మంది మృతిచెందారు. మరో 1,52,200 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక గత 24 గంటల్లో 36 మంది కరోనాకు బలవగా, 18,143 మంది కోలుకుని డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం కేసుల్లో 0.35 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.45 శాతం, మరణాలు 1.20 శాతంగా ఉన్నాయని కేంద్రం తెలిపింది.

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 33,017 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 652 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాదులో 297, రంగారెడ్డి జిల్లాలో 57, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 51 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 627 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటిదాకా 8,13,772 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 8,04,950 మంది కోలుకోగా.. ఇంకా 4,711 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మరణించారు.