National

దేశంలో కరోనా కేసుల అప్డేట్స్..!

భారతదేశంలో గత 24 గంటల్లో 39,097 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,13,32,159కు చేరింది. అదే సమయంలో 35,087 మంది కోలుకున్నారు. గత 24 గంటల్లో 546 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. భారతదేశంలో మృతుల సంఖ్య మొత్తం 4,20,016కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,05,03,166 మంది కోలుకున్నారు. 4,08,977 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 42,78,82,261 వ్యాక్సిన్ డోసులు వేశారు.

23-07-2021న ఆంధ్రప్రదేశ్ అధికారులు వెల్లడించిన కరోనా వివరాల ప్రకారం.. ఏపీలో గడచిన 24 గంటల్లో 65,920 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,747 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 293 కేసులు నమోదు కాగా, అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 9 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 2,365 మంది కరోనా నుంచి కోలుకోగా, 14 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 19,50,339 పాజిటివ్ కేసులు నమోదు కాగా 19,14,177 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 22,939 మంది చికిత్స పొందుతున్నారు. తాజా మరణాలతో కలిపి 13,223 మంది కరోనాతో మృతి చెందారు.

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 1,20,530 కరోనా పరీక్షలు నిర్వహించగా 643 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 77 నారాయణపేట జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 767 మంది కరోనా నుంచి కోలుకోగా, నలుగురు మృతి చెందారు. తాజా మరణాలతో కలిపి తెలంగాణలో కరోనా మృతుల సంఖ్య 3,778కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటిదాకా 6,40,012 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,26,505 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 9,729 మంది చికిత్స పొందుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

7 + 20 =

Back to top button